త్వరలో రిటైల్ ట్రేడ్ పాలసీ, ప్రమాద బీమా పథకాన్ని తెచ్చే యోచనలో ప్రభుత్వం!

Update: 2023-04-23 11:20 GMT

న్యూఢిల్లీ: దేశీయ రిటైల్ రంగంలోని వ్యాపారులకు ప్రయోజనాలు కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం త్వరలో జాతీయ రిటైల్ ట్రేడ్ పాలసీ, ప్రమాద బీమా పథకాన్ని ప్రకటించనుందని ఓ అధికారి తెలిపారు. కొత్త ట్రేడ్ పాలసీ ద్వారా రిటైల్ రంగంలోని జీఎస్టీ-నమోదిత వ్యాపారులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, మరింత రుణాన్ని అందించేందుకు వీలవుతుంది. అందులో మెరుగైన రుణ సదుపాయాన్ని సులభంగా, తక్కువ సమయంలో అందించే విధంగా నిబంధనలు ఉంటాయి. అలాగే, రిటైల్ వ్యాపారంలో ఆధునికీకరణ, డిజిటలైజేషన్‌ను సులభతరం చేయడం, సరఫరా వ్యవస్థకు మౌలిక సదుపాయాల మద్దతు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడ, కార్మికుల ఉత్పాదకతను మెరుగుపరచడం, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం ఏర్పాటయ్యేల పాలసీ రూపకల్పన ఉండనుంది.

అంతేకాకుండా ప్రపంచంలోనే ఐదవ అతిపెద్దదైన భారత రిటైల్ రగంలోని జిఎస్టీ-నమోదిత రిటైల్ వ్యాపారులందరికీ బీమా పథకాన్ని రూపొందించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ భావిస్తోంది. కేవలం ఈ-కామర్స్ మాత్రమే కాకుండా రిటైల్ రంగంలోని ఇతర వ్యాపారులకు ఇది వర్తిస్తుంది. ఇక, ట్రేడ్ పాలసీతో పాటు బీమా పథకంపై స్పందించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) స్పందిస్తూ, రిటైల్ ట్రేడ్ పాలసీ ఖచ్చితంగా ఈ రంగంలోని వ్యాపారన్ని విస్తృతం చేసేందుకు సహాయపడుతుంది. వ్యాపారులకు బీమా పథకం అందించడం ద్వారా దేశ ఖజానాకు వారు అందిస్తున్న సహకారాన్ని గుర్తించినట్టు అవుతుందని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు.

Tags:    

Similar News