వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
ఆర్థిక సంవత్సరం ప్రతి నెల ఒకటో తేదీన నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుతాయని ప్రజలు గంపెడు ఆశలతో ఎదురుచూస్తారు.
దిశ, వెబ్ డెస్క్: ఆర్థిక సంవత్సరం ప్రతి నెల ఒకటో తేదీన నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుతాయని ప్రజలు గంపెడు ఆశలతో ఎదురుచూస్తారు. నేడు గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు ఒకటో తేదీ శుభవార్త అందించాయి. గ్యాస్ సిలిండర్ ధర రూ. 85 తగ్గిస్తూ కాస్త ఊరటనిచ్చారు. ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. గత నెల కూడా సిలిండర్ రేట్లు రూ. 172 మేర తగ్గింది. మళ్లీ ఇప్పుడు రూ. 85 తగ్గడంతో మొత్తం రూ.250 దిగి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో సామాన్యులు మండిపడుతున్నారు. గత కొద్ది కాలంగా వంట గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
నేడు గ్యాస్ సిలిండర్ ధరలు
హైదరాబాద్: రూ. 1,155
వరంగల్: రూ.1,174
విశాఖపట్నం: రూ. 1,112
విజయవాడ: రూ. 1,118
గుంటూర్: 1,114
Also Read: జూన్-1: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..