బంగారం కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు!

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బంగారంపై

Update: 2024-07-25 05:58 GMT

దిశ, ఫీచర్స్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బంగారంపై ఆరు శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో అమాంతం బంగారం ధరలు పడిపోయిన విషయం తెలిసిందే. దాదాపు రూ.3000ల వరకు గోల్డ్ దిగొచ్చింది. ఇక నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. ఈరోజు బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,950 ఉండగా, నేడు 950 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.64000గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.70,860గా ఉండగా, నేడు రూ.1040గా తగ్గడంతో గోల్డ్ ధర రూ.69,820 గా ఉంది.

కాగా, ఈ రోజు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే?

22 క్యారెట్ల బంగారం ధర - రూ.64,000

24 క్యారెట్ల బంగారం ధర - రూ.69,820

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.64,000

24 క్యారెట్ల బంగారం ధర – రూ.69,820

Tags:    

Similar News