గుడ్ న్యూస్ : నేడు భారీగా తగ్గిన బంగారం ధర

ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా మహిళలు. ఇక ఇప్పుడు పెళ్లీల సీజన్ కావడంతో చాలా

Update: 2023-05-13 01:59 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా మహిళలు. ఇక ఇప్పుడు పెళ్లీల సీజన్ కావడంతో చాలా మంది మగువలు బంగారం కొనుగోలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అయితే అలాంటి వారికి ఈరోజు తీపికబురు అందింది.

నేడు మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి.శనివారం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధరపై రూ.400 తగ్గడంతో గోల్డ్ ధర రూ.56,550గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.440 తగ్గడంతో గోల్డ్ ధర రూ.61,690గా ఉంది.

Also Read...

మే-13: నేడు గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

Tags:    

Similar News