నేడు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
మహిళలకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇప్పుడు పెళ్లీల సీజన్ మొదలైంది. దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇప్పుడు పెళ్లీల సీజన్ మొదలైంది. దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈక్రమంలో బంగారం తగ్గడం వారికి తీపికబురు లాంటిది.
కాగా, శుక్రవారం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధరపై రూ.100 తగ్గడంతో గోల్డ్ ధర రూ.50,900గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధరపై రూ.100 తగ్గడంతో గోల్డ్ ధర రూ.55,530గా ఉంది. ఇక నేడు వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. కేజీ వెండి ధరపై రూ.100 తగ్గడంతో వెండి ధర రూ.67,400గా నమోదైంది.
Also Read..
10 వేల రూపాయల నోట్లను ముద్రించిన RBI.. రూ.2 వేల నోట్ ఫైనల్ కాదా..?