Gold Prices: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు బంగారు ఆభరణాలు ధరిస్తారు.

Update: 2024-08-01 05:48 GMT

దిశ, ఫీచర్స్: ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు బంగారు ఆభరణాలు ధరిస్తారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని మహిళలందరూ బంగారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అనేక రకాల డిజైన్లతో లక్షల్లో విలువ చేసే కమ్మలు, నెక్లెస్‌లు, బ్యాంగిల్స్ వంటివి కొనుగోలు చేస్తుంటారు. ఆడవాళ్లకు ప్రతి రోజూ షాపింగ్ చేసిన బోర్ కొట్టదంటారు. కాగా గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా? అంటూ వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. కాస్త పసిడి ధరలు తగ్గాయని తెలిసిన వెంటనే బంగారం షాపుల్లో ఎగబడుతుంటారు. అయితే ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ రేట్లతో మహిళల్లో ఓసారి ఉత్సాహం నెలకొనగా.. మరోసారి నిరాశకు గురవుతుంటారు.

ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ బంగారం రేట్లు పలు మార్పులు చోటుచేసుకున్నాయి. నిన్నటితో పోలిస్తే.. నేడు బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలు దారులకు షాకిచ్చాయి. 22 క్యారెట్ల బంగారం ధరపై ఏకంగా రూ. 500 పెరగడంతో రూ. 64,500కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ. 540 పెరగ్గా రూ. 70, 360కి విక్రయిస్తున్నారు. ఇక కిలో వెండి విషయానికొస్తే రూ. 91,700గా ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 64,500

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 70,360

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 64,500

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 70,360

Tags:    

Similar News