RBI: భౌగోళిక రాజకీయ పరిణామాల వల్లే సెంట్రల్ బ్యాంకులకు ఇబ్బందులు

మధ్యప్రాచ్యంలో పరిస్థితులు హింసాత్మకంగా మారిన సమయంలో ఈ అంశం ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు.

Update: 2024-09-24 17:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: నిరంతర భౌగోళిక రాజకీయ ప్రతికూల అంశాలు, ప్రపంచ ఆర్థిక ఇబ్బందులు సెంట్రల్ బ్యాంకులకు బలీయమైన సవాళ్లుగా మారాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో పరిస్థితులు హింసాత్మకంగా మారిన సమయంలో ఈ అంశం ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు. మంగళవారం నేపాల్‌లోని ఖాట్మండు రాస్ట్రా బ్యాంకు కార్యక్రమంలో మాట్లాడిన దాస్.. గత కొన్నేళ్ల నుంచి భౌగోళిక రాజకీయ మార్పులు భిన్నంగా ఉంటున్నాయి. తరచుగా సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, వాణిజ్య, సాంకేతికత, మూలధన నిధులకు అడ్డంకులు ఏర్పడటం వంటి విషయాలు ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఇవి మారుతున్న ఆర్థిక సవాళ్లకు కొత్త మూలాలుగా మారుతున్నాయి. సెంట్రల్ బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని, సమయానుకూలంగా సరైన పద్దతిలో సవాళ్లను ఎదుర్కోవాలని దాస్ సూచించారు.

Tags:    

Similar News