GDP Growth: భారత జీడీపీ వృద్ధి 6.8 శాతం: క్రిసిల్ రేటింగ్స్

జీడీపీ వృద్ధి రేటు 7 శాతం కంటే తక్కువగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Update: 2024-08-26 16:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి మితంగా ఉందని, జీడీపీ వృద్ధి రేటు 7 శాతం కంటే తక్కువగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి అంచనాలను విడుదల చేసింది. దీని ప్రకారం, సార్వత్రిక ఎన్నికల కారణంగా ప్రభుత్వ మూలధన వ్యయం, పట్టణ వినియోగం తగ్గడంతో సమీక్షించిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.8 శాతం ఉంటుందని అంచనా వేసింది. ఇవే కారణాలతో మరో పరిశోధనా సంస్థ ఇక్రా సైతం ఆరు త్రైమాసికాల కనిష్టం 6 శాతంగా అంచనా కట్టింది. లోక్‌సభ ఎన్నికల వల్ల తొలి త్రైమాసికంలో కొన్ని రంగాల కార్యకలాపాలు తాత్కాలికంగా తగ్గుముఖం పట్టాయి, తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మూలధన నిధులు తగ్గాయని ఇక్రా రీసెర్చ్ హెడ్, చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ అన్నారు. ఇదే సమయంలో కమొడిటీ ధరల నుంచి లాభాలు నెమ్మదించడంతో పారిశ్రామిక రంగాల లాభదాయకతపై ప్రభావం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు, తొలి త్రైమాసికంలో భారత జీడీపీ 7-7.10 శాతం మధ్య ఉంటుందని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. ప్రపంచ సరుకు రవాణా, సెమీకండక్టర్ల కొర, కంటైనర్ ఖర్చులు వంటి సవాళ్ల మధ్య దేశ ఆర్థికవ్యవస్థ ఒత్తిళ్లను ఎదుర్కొంటోందని ఎస్‌బీఐ రీసెర్చ్ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News