Mastercard: మాస్టర్‌కార్డ్ ఇండియా ఛైర్మన్‌గా రజనీష్ కుమార్!

దేశీయ బ్యాంకింగ్ రంగ నిపుణులు, ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ పేమెంట్ టెక్నాలజీ కంపెనీ మాస్టర్‌కార్డ్ ఇండియా ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

Update: 2023-09-14 13:26 GMT

న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ రంగ నిపుణులు, ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ పేమెంట్ టెక్నాలజీ కంపెనీ మాస్టర్‌కార్డ్ ఇండియా ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మాస్టర్‌కార్డ్ ఇండియా గురువారం ప్రకటన విడుదల చేసింది. 210కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలో ఆయన కీలకమైన నాన్-ఎగ్జిక్యూటివ్ సలహాదారుగా సేవలు అందిస్తారని మాస్టర్‌కార్డ్ ఇండియా పేర్కొంది. అలాగే, గౌతమ్ అగర్వాల్ నేతృత్వంలోని మాస్టర్‌కార్డ్ సౌత్ ఏషియా ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ టీమ్‌కి మార్గనిర్దేశం చేయనున్నారని వెల్లడించింది.

రజనీష్ కుమార్ ఎస్‌బీఐలో దాదాపు 4 దశాబ్దాల పాటు విధులు నిర్వహించారు. భారత్‌తో పాటు కెనడా, యూకే దేశాల్లోని బ్యాంకు కార్యకలాపాలను ముందుండి నడిపించారు. ఆయన నాయకత్వంలోనే ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్ సేవల యాప్ యోనో ప్రారంభించారు. ఎస్‌బీఐ ఛైర్మన్‌గా మూదేళ్ల పాటు పనిచేశారు. కార్పొరేట్ క్రెడిట్, ప్రాజెక్ట్ ఫైనాన్స్ వంటి అంశాల్లో నైపుణ్యం ఉన్న రజనీష్ కుమార్ ఎల్అండ్‌టీ, హెచ్ఎస్‌బీసీ ఆసియా పసిఫిక్, బ్రూక్‌ఫీల్డ్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ కంపెనీల బోర్డుల్లో డైరెక్టర్ హోదాలో బాధ్యతలు చేపట్టారు.


Similar News