3,800 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫోర్డ్!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఉద్యోగుల తొలగింపుల జాబితాలో చేరింది.

Update: 2023-02-14 15:11 GMT

బెర్లిన్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఉద్యోగుల తొలగింపుల జాబితాలో చేరింది. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)కు పెరుగుతున్న గిరాకీ తో పాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాబోయే మూడేళ్లలో 3,800 మందిని తీసేయనున్నట్టు తెలిపింది. కంపెనీ ఈవీ తయారీ వైపునకు మారుతున్న నేపథ్యంలో ఇంజనీర్ల అవసరం పెద్దగా అవసరం తక్కువగా ఉంటుందని ఫోర్డ్ అభిప్రాయపడింది.

2035 నాటికి కంపెనీ యూరప్ మార్కెట్లో పూర్తిగా ఈవీ లను కలిగి ఉండాలనే లక్ష్యంతో ఉంది. అందుకే భారీ సంఖ్యలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని చూస్తోంది. మొత్త ఉద్యోగుల్లో అత్యధికంగా 2,800 మంది వరకు ఇంజనీర్ విభాగంలోని వారే ఉంటారని కంపెనీ తెలిపింది. జర్మనీలో 2,300, యూకేలో 1,300, మిగిలిన ప్రాంతాల్లో మరో 200 మంది ఉంటారని కంపెనీ వివరించింది. ఈ ఏడాదిలో తన మొదటి ఈవీని విడుదల చేస్తామని ఫోర్డ్ పేర్కొంది. తొలగించబోయో ఉద్యోగులకు సంస్థ నుంచి మద్దతు ఉంటుందని, కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ వారికి సహకారం లభిస్తుందని కంపెనీ జనరల్ మేనేజర్ మార్టిన్ సాండర్ వెల్లడించారు.

Tags:    

Similar News