Flipkart నుంచి మరోసారి ఆఫర్ల జాతర.. ‘బిగ్ దసరా సేల్’.. ఇవే తేదీలు

ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ పండగల నేపథ్యంలో భారీ తగ్గింపులతో ప్రత్యేక సేల్‌ను గత కొద్ది రోజుల క్రితం తీసుకురాగా, దసరా పండగకు ముందు మరో సేల్‌ను ప్రకటించింది.

Update: 2023-10-21 09:01 GMT
Flipkart నుంచి మరోసారి ఆఫర్ల జాతర.. ‘బిగ్ దసరా సేల్’.. ఇవే తేదీలు
  • whatsapp icon

హైదరాబాద్: ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ పండగల నేపథ్యంలో భారీ తగ్గింపులతో ప్రత్యేక సేల్‌ను గత కొద్ది రోజుల క్రితం తీసుకురాగా, దసరా పండగకు ముందు మరో సేల్‌ను ప్రకటించింది. అదే ‘బిగ్ దసరా సేల్’. ఇది అక్టోబర్ 22 నుంచి 29 వరకు జరుగుతుంది. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో అన్ని రకాల ఉత్పత్తులపై తగ్గింపులు, డిస్కౌంట్లు ఉంటాయని కంపెనీ పేర్కొంది. కొనుగోలు సమయంలో ఎస్‌బీఐ, ఆర్‌బీఎల్, కోటక్ బ్యాంక్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ మెంబర్స్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై 10 శాతం తగ్గింపు ఉంటుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, ఫ్యాషన్, హోమ్ అప్లియన్సెస్, కంప్యూటర్లు, వాషింగ్ మెషిన్లు మొదలగు వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Tags:    

Similar News