Finance Ministry: డీలర్ స్టోర్లలో డెమో వాహనాలపై జీఎస్టీ మినహాయింపు

యాడ్ ఏజెన్సీలు, డేటా హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్లు, వస్తువుల ఎగుమతిదారులకు ఉపశమనం కల్పిస్తూ సర్క్యులర్ జారీ చేసింది.

Update: 2024-09-11 18:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆటో పరిశ్రమకు, విదేశీ క్లయింట్లకు సేవలందించే యాడ్ ఏజెన్సీలు, డేటా హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్లు, వస్తువుల ఎగుమతిదారులకు ఉపశమనం కల్పిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. ఇందులో వాహన డీలర్లు వినియోగదారులకు వాహనానికి సంబంధించి డిజైన్, ఫీచర్ల గురించి వివరించేందుకు స్టోర్లలో ఉంచే డెమో వాహనాలపై జీఎస్టీ మినహాయింపు ఇస్తూ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే, డేటా హోస్టింగ్ సేవలందించే కంపెనీలు తమ సేవలను భారత్‌కు వెలుపల క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడర్లకు అందిస్తాయి. అలాంటి సేవలను జీఎస్టీ పన్ను నుంచి మినహాయిస్తూ సర్క్యులర్‌లో పేర్కొంది. ఎగుమతిదారులకు సంబంధించి కస్టమ్స్ కింద ఏవైనా వస్తువులను ప్రయోజనాల కింద దిగుమతి చేసుకున్నప్పటికీ, వాటిపై పన్నులు చెల్లించినట్టయితే, అలాంటి వస్తువుల ఎగుమతులపై చెల్లించిన ఔట్‌పుట్ జీఎస్టీని రీఫండ్‌గా పొందవచ్చు. చివరగా, విదేశీ క్లయింట్లకు సేవలందించే యాడ్ ఏజెన్సీలకు జీఎస్టీ ఉండదని సర్క్యులర్‌లో పేర్కొంది. 

Tags:    

Similar News