FIIs: ఆరు రోజుల్లోనే రూ. 20 వేల కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఫారిన్ ఇన్వెస్టర్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) గత కొంత కాలంగా ఎక్కువ శాతం నష్టాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-11-09 13:25 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) గత కొంత కాలంగా ఎక్కువ శాతం నష్టాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితితులు, త్రైమాసిక ఫలితాల్లో(Quarterly Results) చాలా వరకు కార్పొరేట్ కంపెనీలు లాభాలు తగ్గడం వంటివి స్టాక్ మార్కెట్ నష్టాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(FII) తమ పెట్టుబడులను క్రమంగా తగ్గించుకుంటున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాలలో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల అక్టోబర్ నెలలో భారీగా షేర్లను సేల్ చేసిన ఎఫ్ఐఐలు ఈ నెల(నవంబర్)లో కూడా అదే బాటలో వెళ్తున్నారు.

కాగా అక్టోబర్లో ఫారిన్ ఇన్వెస్టర్లు ఏకంగా రూ. 94,017 కోట్లను బ్యాక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(NSDL) తెలిపిన సమాచారం ప్రకారం ఎఫ్ఐఐలు నవంబర్ 2 నుంచి 8 మధ్య రూ. 23,398 కోట్ల విలువైన షేర్లను వెనక్కి తీసుకున్నారు. విదేశీ మదుపర్లు శుక్రవారం ఒక్క రోజే మార్కెట్ నుంచి రూ.3,404 కోట్లను ఉపసంహరించుకున్నారు. మరికొన్ని రోజులు విదేశీ ఇన్వెస్టర్లు ఇలానే పెట్టుబడులు వెనక్కి తీసుకునే అవకాశముందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Tags:    

Similar News