Tata Motors: దేశీయంగా డిమాండ్.. కానీ గ్లోబల్‌గా డల్: టాటా మోటార్స్
రాబోయే కాలంలో కొత్త లాంచ్‌లు, పండుగల నేపథ్యంలో దేశీయంగా వాహనాల అమ్మకాలు పుంజుకుంటాయని టాటా మోటార్స్ అంచనా వేస్తుంది.
దిశ, బిజినెస్ బ్యూరో: రాబోయే కాలంలో కొత్త లాంచ్‌లు, పండుగల నేపథ్యంలో దేశీయంగా వాహనాల అమ్మకాలు పుంజుకుంటాయని టాటా మోటార్స్ అంచనా వేస్తుంది, కానీ అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న పరిస్థితుల కారణంగా విదేశీ మార్కెట్లలో డిమాండ్ మందకొడిగా ఉంటుందని పేర్కొంది. దేశీయ మార్కెట్‌లో, మౌలిక సదుపాయాలు, అనుకూలమైన మొత్తం ఆర్థిక వ్యవస్థ కారణంగా వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా రాబోయే పండుగ కాలంలో చాలా కొత్త వాహనాలు రాబోతున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థం నాటికి దేశీయ డిమాండ్ పెరుగుతుందని మాకు నమ్మకం ఉందని టాటా మోటార్స్ గ్లోబల్ సీఎఫ్‌ఓ అని పీబీ బాలాజీ అన్నారు. రాబోయే త్రైమాసికాల్లో బలమైన పనితీరును కొనసాగించగలమని నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇదే సమయంలో గ్లోబల్ డిమాండ్‌కు సంబంధించినంత వరకు అమ్మకాలు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచదేశాల్లో యుద్ధ వాతావరణం, ఆర్థిక మాంద్యం ప్రభావం కారణంగా విదేశీ మార్కెట్లోలో గత కొంత కాలంగా వాహన అమ్మకాలు తగ్గిపోయాయి. ఈ ప్రభావం మరికొన్ని నెలలు కొనసాగవచ్చని ఆయన అంచనా వేశారు. ఇదిలా ఉంటే టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన పరిశ్రమ రిటైల్ అమ్మకాలు వరుసగా మే, జూన్ రెండు నెలలు క్షీణించాయి. జూన్ త్రైమాసికంలో సంస్థ రూ. 5,566 కోట్ల ఏకీకృత నికర లాభం, రూ. 1,09,623 కోట్ల మొత్తం ఆదాయాన్ని ప్రకటించింది.