భారత మార్కెట్లో ఆఫీస్ స్థలాలకు భారీ డిమాండ్!

దేశంలోని ప్రధాన ఏడు నగరాల్లో ఆఫీస్ స్థలాలకు గిరాకీ బలంగా ఉందని ఓ నివేదిక తెలిపింది.

Update: 2023-10-01 13:09 GMT

న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన ఏడు నగరాల్లో ఆఫీస్ స్థలాలకు గిరాకీ బలంగా ఉందని ఓ నివేదిక తెలిపింది. కన్సల్టెన్సీ సంస్థ వెస్టియన్ ఆదివారం ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల సగటు అద్దె వివరాలను వెల్లడించింది. భారత్‌లోని ప్రధాన ఏడు నగరాల్లో నెలవారీ సగటు ఆదె చదరపు అడుగుకు రూ. 160-170గా ఉందని తెలిపింది. ఇది న్యూయార్క్, లండన్, మియామి, సీటెల్, బోస్టన్‌లో సగటు అద్దె 40-80 డాలర్లు(మన కరెన్సీలో రూ. 3,320-6,640 మధ్య ఉంది. భారత మార్కెట్లో ఆఫీస్ స్థలాలకు పెద్ద బహుళజాతి కంపెనీల నుంచి పెరిగిన అత్యధిక డిమాండ్ కారణంగా పెరిగింది. ఆఫీస్ స్థలాల నిర్వహణకు ఖర్చు తక్కువ కావడంతో పెద్ద కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.

ఇది అంతర్జాతీయంగా ఉన్నదానికంటే అధిక ఆఫీస్ స్థలాల గిరాకీ ఉంది. ప్రధానంగా గత మూడేళ్ల నుంచి కంపెనీలు తమ వ్యాపార నిర్వహణ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఎక్కువ ప్రయోజనాలను పొందుతున్నాయని వెస్టియన్ సీఈఓ శ్రీనివాసన్ రావు అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ఆక్యుపెన్సీ, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉన్నందున బహుళజాతి కంపెనీలకు కలిసొస్తోందని ఆయన పేర్కొన్నారు. దేశీయ నగరాల్లో సగటు అద్దె ముంబై అత్యధికంగా చదరపు అడుగ్కు 100-165 మధ్య ఉంది. ఢిల్లీలో రూ. 120, బెంగళూరు రూ. 100, పూణెలో రూ. 90, హైదరాబాద్‌లో రూ. 80, చెన్నైలో రూ. 75, కోల్‌కతాలో 60 వరకు ఉన్నాయి.


Similar News