Disneyhotstar: 'జియోహాట్‌స్టార్' డొమైన్‌ కొనుగోలు చేసిన యాప్ డెవలపర్.. రిలయన్స్‌కు లేఖ

జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విలీనం జరుగుతుందని ముందే అంచనా వేసిన జియోహాట్‌స్టార్ పేరుతో డొమైన్ కొన్నాడు.

Update: 2024-10-24 15:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఢిల్లీకి చెందిన ఒక యాప్ డెవలపర్ రిలయన్స్ సంస్థకు షాక్ ఇచ్చాడు. జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విలీనం నేపథ్యంలో దాని డొమైన్‌ను కొనుగోలు చేశాడు. అయితే, డొమైన్‌ను తిరిగిచ్చేందుకు తన ట్యూషన్ ఫీజు చెల్లించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు లేఖ రాశారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విలీనం జరుగుతుందని ముందే అంచనా వేసిన జియోహాట్‌స్టార్ పేరుతో డొమైన్ కొన్నాడు. దీనికి వివరణ ఇస్తూ రిలయన్స్ సంస్థకు లేఖ పంపాడు. 'ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులు కోల్పోయిన తర్వాత డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీగా యూజర్లను పోగొట్టుకుంది. దానివల్ల హాట్‌స్టార్‌ను దేశీయ కంపెనీల్లో విలీనం చేసేందుకు డిస్నీ ప్రయత్నించింది. ఇదే సమయంలో రిలయన్స్ సంస్థ గతంలో కొనుగోలు చేసిన సావన్ మ్యూజిక్ స్ట్రీమింగ్‌ను జియోసావన్.కామ్ డొమైన్‌ను తీసుకుంది. దాని ఆధారంగానే తాను జియోహాట్‌స్టార్ డొమైన్ కొన్నానని డెవలపర్ లేఖలో వివరించారు. అయితే, డొమైన్ కొనే ఉద్దేశానికి కారణాన్ని వివరించిన అతను, కేంబ్రిడ్జ్‌లో చదువుకోవాలనే కల ఉందని, దానికి అవసరమైన ఫీజును చెల్లించాలని సంస్థకు వివరించాడు. కానీ, అతని లేఖకు బదులిచ్చిన రిలయన్స్ సంస్థ డిమాండ్‌ను తిరస్కరించింది. డెవలపర్ అడిగిన కేంబ్రిడ్జ్ ప్రోగ్రామ్ కోసం ట్యూషన్ ఫీజు సుమారు రూ. కోటి ఉంటుంది. అతని కోరికను మరోసారి పరిశీలించాలని డెవలపర్ సంస్థను విన్నవించాడు. 

Tags:    

Similar News