సైబర్ భద్రతే భారత బ్యాంకింగ్‌ రంగానికి ప్రధాన సవాలు

ఆర్‌బీఐ సూపర్‌వైజర్ల బృందం, బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల(ఎన్‌బీఎఫ్‌సీ)కు చెందిన ఐటీ వ్యవస్థల అధ్యయనం

Update: 2024-01-11 11:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: సైబర్ భద్రత విషయంలో ముప్పు ఉన్నప్పటికీ దేశ అభివృద్ధికి తోడ్పాటు అందించే విషయంలో భారత బ్యాంకింగ్ వ్యవస్థ మెరుగ్గానే ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. గురువారం జరిగిన మింట్ బీఎఫ్ఎస్ఐ కాన్‌క్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న దాస్, ఆర్‌బీఐ సూపర్‌వైజర్ల ప్రత్యేక బృందం, బ్యాంకులతో పాటు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)కు చెందిన ఐటీ వ్యవస్థలను అధ్యయనం చేస్తోంది. అందులో ఉన్న లోపాలను వారు ఎత్తి చూపుతారని, ఐటీ, సైబర్ సెక్యూరిటీలో ఉన్న రిస్క్‌పై దృష్టి సారించి, అన్ని ఆర్థిక సంస్థల సైబర్ భద్రతలో ఉన్న సవాళ్లను ఎదుర్కొంటామని వివరించారు. భారత్‌ను పూర్తిస్థాయి అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థగా మార్చేందుకు స్థిరమైన, పటిష్ఠమైన ఆర్థిక రంగాన్ని నిర్మించడంలో ఆర్‌బీఐ కీలకంగా వ్యవహరిస్తుందని దాస్ తెలిపారు. భారత బ్యాంకింగ్ వ్యవస్థ గత కొన్నేళ్ల నుంచి విజయవంతంగా కొనసాగుతోంది. ఇది భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. భారత ఆర్థికవ్యవస్థ విశ్వసనీయతను కాపాడేందుకు ఆర్‌బీఐ కట్టుబడి ఉందని దాస్ పేర్కొన్నారు.

Tags:    

Similar News