Union Budget 2024: స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయడానికే కస్టమ్స్‌ డ్యూటీ తగ్గింపు: పీయూష్‌ గోయల్‌

కేంద్ర బడ్జెట్‌లో బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసిందే.

Update: 2024-07-23 14:43 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర బడ్జెట్‌లో బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తాజాగా వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. దేశీయంగా వీటి తయారీని పెంచేందుకు, ఆభరణాల ఎగుమతులను ప్రోత్సహించేందుకు దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించినట్లు తెలిపారు. అలాగే, బంగారంపై మాట్లాడుతూ, స్మగ్లింగ్‌ను అడ్డుకొనేందుకే సుంకం తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో బంగారం అక్రమ రవాణా భారీగా పెరిగింది. ఇప్పుడు దిగుమతి సుంకాన్ని తీసుకురావడం ద్వారా దీనికి అడ్డుకట్టపడటంతో పాటు, దేశీయంగా వ్యాపారులు తమ నగలను ఇతర దేశాలకు ఎగుమతులను పెంచుకోవడానికి అవకాశం లభిస్తుంది. త్వరలో పెళ్ళిళ్ల సీజన్‌ కూడా వస్తుంది. ఈ నిర్ణయం ద్వారా బంగారం ధరలు తగ్గి, ప్రజలకు మేలు కలుగుతుందని పీయూష్‌ గోయల్‌ అన్నారు. అలాగే, ఏంజెల్ ట్యాక్స్ తొలగింపు నిర్ణయం దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేస్తుందని గోయల్‌ చెప్పారు.

Tags:    

Similar News