మేలో 7 శాతం తగ్గిన దేశీయ కంపెనీల నియామకాలు!

ప్రస్తుతం అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా కూడా కంపెనీలు పెద్ద ఎత్తున తొలగింపులు చేపడుతున్నాయి.

Update: 2023-06-08 10:38 GMT

న్యూఢిల్లీ: ప్రస్తుతం అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా కూడా కంపెనీలు పెద్ద ఎత్తున తొలగింపులు చేపడుతున్నాయి. ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలోని కంపెనీల నియామకాల కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టాయని తాజాగా ఓ నివేదిక తెలిపింది. గతేడాదితో పోల్చితే గత నెలలో భారతీయ కంపెనీల నియామక కార్యకలాపాలు 7 శాతం క్షీణించాయని ఫౌండ్ఇట్ నివేదిక గురువారం ప్రకటనలో వెల్లడించింది.

ఆర్థిక అనిశ్చితి, గ్లోబల్ పరిణామాల మధ్య కంపెనీలు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటంతో నియామకాలు దెబ్బతిన్నాయి. అయితే కొన్ని నగరాల్లో నియామకాలు సానుకూలంగానే ఉన్నాయని నివేదిక తెలిపింది. రానున్న రోజుల్లో నియామకాలు ఊపందుకునే అవకాశాలు ఉన్నాయని నివేదిక అభిప్రాయపడింది.

నియామకాలు తగ్గినప్పటికీ నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త స్కిల్స్ నేర్చుకోవడంతో పాటు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా అవకాశాలు లభిస్తాయని ఫౌండ్ఇట్ సీఈఓ శేఖర్ గరిసా అన్నారు. మొత్తంగా నియామకాల కార్యకలాపాలు తగ్గినప్పటికీ కొన్ని రంగాల్లో పెరుగుదల ఉంది.

షిప్పింగ్/మెరైన్ రంగంలో 45 శాతం నియామకాలు పెరిగాయి. ఇది పోర్ట్‌లలో పెరిగిన సామర్థ్యం, అధునాత టెక్నాలజీ అమలు వంటి అంశాల మద్దతు ద్వారా వృద్ధి నమోదైంది. ఆ తర్వాత రిటైల్, ప్రయాణ, ఆతిథ్య రంగాల్లో 27 శాతం, ఆటోమేషన్ రంగంలో 4 శాతం నియామకాల వృద్ధి కనబడిందని నివేదిక పేర్కొంది.

Tags:    

Similar News