గృహిణులకు శుభవార్త.. హోలీకి ముందు భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు..!!
సామాన్యులకు శుభవార్త. వంట నూనె ధరలు దిగి వస్తున్నాయి.
దిశ, ఫీచర్స్: సామాన్యులకు శుభవార్త. వంట నూనె ధరలు దిగి వస్తున్నాయి. తాజాగా పలు కంపెనీలు వంట నూనె ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. దీని వల్ల ప్రజలకు భారీ ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. నిత్యావసర వస్తువుల్లో ఒకటైన వంట నూనె లేకపోతే వంట చేయడం కష్టం. కాగా కేంద్రం ఎప్పటినుంచో దేశ ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రీసెంట్ గా అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాలని ప్రభుత్వం వంటనూనె బ్రాండ్ కంపెనీలకు సూచించింది.
అయితే లేటెస్ట్ అప్డేడ్ ప్రకారం.. హోలీకి ముందే హోల్‌సేల్ మార్కెట్‌లకు ఆవాలు రికార్డు స్థాయిలో వస్తున్నాయి. కాగా మంగళవారం దేశంలోని నూనెగింజల మార్కెట్‌లో ఆవాలు సహా అన్ని నూనె గింజల ధరలు ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో మార్కెట్లలో నూనె గింజల ధరలు తగ్గాయి. నిన్న హోల్ సేల్ మార్కెట్లకు సుమారు 16 లక్షల బస్తాల ఆవాలు వచ్చినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా సుదీర్ఘ హోలీ హాలీడేస్‌కు ముందు చిన్న రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు తరలిస్తున్నారు.
రానున్న కాలంలో సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే పెద్ద రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర కోసం వేచి చూస్తున్నారు. ప్రస్తుతం విక్రయిస్తున్న వారు మద్దతు ధర కంటే 10-12 శాతం తక్కువ రేటుకు మార్కెట్లో అమ్ముతున్నారు. అంతేకాకుండా ఇలాంటి పరిస్థితుల్లో వేరుశనగ, పామోలిన్, క్రూడ్ పామాయిల్, ఆవాలు, సోయాబీన్ నూనె గింజలు, కాటన్ సీడ్ నూనెలు కూడా నష్టాల్లో ఉన్నాయి. కాగా వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ప్రస్తుతం క్వింటాకు నూనె గింజల ధరలు చూసినట్లైతే..
* వేరుశనగ - క్వింటాల్‌కు రూ. 6,080-6,355.
* ఆవాలు నూనె గింజలు - క్వింటాల్‌కు రూ. 5,275-5,315.
* సీపీఓ మాజీ కండ్ల - క్వింటాల్‌కు రూ. 9,250.
* సోయాబీన్ ఆయిల్ మిల్లు డెలివరీ ఢిల్లీ - క్వింటాల్‌కు రూ. 10,950.
* పత్తి గింజల మిల్లు డెలివరీ (హర్యానా)- క్వింటాల్‌కు రూ. 9,550.
* పామోలిన్ RBD, దిల్లీ - క్వింటాల్‌కు రూ. 10,600.
* పామోలిన్ ఎక్స్-కాండ్లా - క్వింటాల్‌కు రూ. 9,700