Sai Life Sciences IPO: సాయి లైఫ్ సైన్సెస్ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్
ఇటీవల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market)లోకి ప్రవేశించేందుకు చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market)లోకి ప్రవేశించేందుకు చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పబ్లిక్ ఇష్యూల కోసం పలు సంస్థలు క్యూ కడుతున్నాయి. తాజాగా హైదరాబాద్(HYD) కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఫార్మా కంపెనీ(Pharma Company) సాయి లైఫ్ సైన్సెస్(Sai Life Sciences) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO)కు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఐపీఓ కోసం గత జులైలో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ(SEBI) వద్ద డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) దాఖలు చేయగా తాజాగా ఆమోదం లభించింది. ఐపీఓ ద్వారా సుమారు రూ. 800 కోట్ల విలువైన షేర్లను సాయి లైఫ్ సైన్సెస్ జారీ చేయనుంది. ఇందులో రూ. 6.5 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనున్నారు. కాగా సాయి లైఫ్ సైన్సెస్ కంపెనీలో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన టీపీజీ కేపిటల్(TPG Capital)కు వాటా ఉంది. ఈ ఇష్యూ ద్వారా ఆ సంస్థ కొత్త మేర వాటాను సేల్ చేయనుందని తెలుస్తోంది. అయితే ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 600 కోట్లను లోన్ కోసం వినియోగించనుంది. ఇదిలా ఉంటే..సాయి లైఫ్ సైన్సెస్ తో పాటు మరో మూడు సంస్థల ఐపీవో ప్రతిపాదనకు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రుబికాన్ రీసర్చ్, సనాథన్ టెక్స్‌టైల్స్, మెటల్‌మ్యాన్ ఆటో ఇందులో ఉన్నాయి. ఈ నాలుగు కంపెనీలు గరిష్ఠంగా రూ.3 వేల కోట్ల వరకు నిధులు సమీకరించనున్నాయి. దీంట్లో రుబికాన్ రీసర్చ్ కంపెనీయే రూ.1,085 కోట్ల నిధులను సమీకరించనుంది.