బ్యాంకింగ్ రంగంపై నిరంతరం పర్యవేక్షణ: RBI
అదానీ గ్రూప్‌కు బ్యాంకులు ఇచ్చిన రుణాలపై మీడియా నివేదికలతో ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) స్పందించింది.
ముంబై: అదానీ గ్రూప్‌కు బ్యాంకులు ఇచ్చిన రుణాలపై మీడియా నివేదికలతో ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) స్పందించింది. దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి బ్యాంకింగ్ రంగంపై, వ్యక్తిగత బ్యాంకులపై నిరంతరం నిఘా ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. అలాగే, బ్యాంకింగ్ రంగం స్థితిస్థాపకంగా, స్థిరంగా ఉందని తెలిపింది. మూలధన సమృద్ధి, ఆస్తి నాణ్యత, లిక్విడిటీ, ప్రొవిజన్ కవరేజ్, లాభదాయకతకు సంబంధించిన వివిధ పారామితులు ఆరోగ్యకరంగా ఉన్నాయి. బ్యాంకులు, ఆర్‌బీఐ నిబంధనలు, లార్జ్ ఎక్స్‌పోజర్ ఫ్రేమ్‌వర్క్ (LEF) మార్గదర్శకాలను పాటిస్తున్నాయని తెలిపింది. తమ వద్ద సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సిఆర్‌ఐఎల్‌సి) డేటాబేస్ సిస్టమ్ ఉందని దీని ద్వారా రూ. 5 కోట్లు అంతకంటే ఎక్కువ క్రెడిట్స్‌కు సంబంధించిన నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, అలాగే బ్యాంకింగ్ సెక్టార్‌పై అప్రమత్తంగా ఉన్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది.
ఇవి కూడా చదవండి : Credit Score చెక్ చేస్తున్నారా.. 750 కంటే తక్కువగా ఉంటే పరిస్థితేంటి?