ఆరు నెలల కనిష్టానికి కీలక రంగాల వృద్ధి!

ఈ ఏడాది ఏప్రిల్‌లో మౌలిక రంగం నెమ్మదించింది. గత నెలలో ఎనిమిది కీలక మౌలిక రంగాల వృద్ధి రేటు ఆరు నెలల కనిష్ఠంతో 3.5 శాతంగా నమోదైనట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి

Update: 2023-05-31 14:15 GMT

న్యూఢిల్లీ:ఈ ఏడాది ఏప్రిల్‌లో మౌలిక రంగం నెమ్మదించింది. గత నెలలో ఎనిమిది కీలక మౌలిక రంగాల వృద్ధి రేటు ఆరు నెలల కనిష్ఠంతో 3.5 శాతంగా నమోదైనట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ప్రధానంగా ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుదుత్పత్తి క్షీణించడమే దీనికి కారణమని గణాంకాలు పేర్కొన్నాయి.

వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఏప్రిల్‌లో బొగ్గు ఉత్పత్తి 9 శాతం పెరిగింది. అదేవిధంగా ఏప్రిల్‌లో ఎరువుల ఉత్పత్తి 23.5 శాతం, ఉక్కు 12.1 శాతం, సిమెంట్ ఉత్పత్తి 11.6 శాతం పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. అలాగే, ముడి చమురు 3.5 శాతం, సహజవాయువు 2.8 శాతం, పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు 1.5 శాతం, విద్యుదుత్పత్తి 1.4 శాతం క్షీణించింది. పారిశ్రామికోత్పత్తి సూచీలో ఈ రంగాల వాటా 40.27 శాతంగా ఉంటుంది.

Tags:    

Similar News