ఓఎల్ఎక్స్‌ క్లాసిఫైడ్, ఆటో వ్యాపారాన్ని కొనుగోలు చేసిన కార్‌ట్రేడ్!

ప్రముఖ ఆన్‌లైన్ ఆటో ప్లాట్‌ఫామ్ కార్‌ట్రేడ్ టెక్ ఓఎల్ఎక్స్‌కు చెందిన క్లాసిఫైడ్, ఆటో వ్యాపారాన్ని కొనుగోలు చేసింది.

Update: 2023-08-13 16:17 GMT

న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్ ఆటో ప్లాట్‌ఫామ్ కార్‌ట్రేడ్ టెక్ ఓఎల్ఎక్స్‌కు చెందిన క్లాసిఫైడ్, ఆటో వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. రూ. 535.54 కోట్లకు కంపెనీని పూర్తిగా 100 శాతం స్వాధీనం చేసుకున్నట్టు కార్‌ట్రేడ్ ఆదివారం ప్రకటనలో వెల్లడించింది. 10 కోట్ల యాప్ డౌన్‌లోడ్‌లతో దేశీయంగా అత్యంత ఆదరణ కలిగిన ఓఎల్ఎక్స్ కార్లు, బైకులు, రియల్ఎస్టేట్, ఎలక్ట్రానిక్స్ సహా 12 రకాల వ్యాపారాల్లో విస్తరించింది.

దాదాపు 30 వేల మంది డీలర్లను కలిగిన ఓఎల్ఎక్స్ ఆటో, క్లాసిఫైడ్ వ్యాపారం కొనుగోలు ద్వారా భవిష్యత్తులో భారత్‌లోనే అతిపెద్ద క్లాసిఫైడ్, ఆటొ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాలనే లక్ష్యంతో ఉన్నామని కార్‌ట్రేడ్ పేర్కొంది. ఈ కొనుగోలుతో ఏటా 13 లక్షల వాహనాలను వేలం ద్వారా విక్రయించవచ్చని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 4 వేలకు పైగా ఉంటుందని కార్‌ట్రేడ్ వివరించింది. దేశవ్యాప్త్నగా 100 నగరాల్లో ఉనికిని విస్తరించగలమని వెల్లడించింది.


Similar News