Canara Bank: లోన్స్ తీసుకునే వారికి షాక్ .. వడ్డీరేట్లు పెంచిన కెనరా బ్యాంక్

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ అయిన కెనరా బ్యాంక్(Canara Bank) రుణ గ్రహీతలకు షాకిచ్చింది.

Update: 2024-10-11 02:25 GMT

దిశ, వెబ్‌డెస్క్:దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ అయిన కెనరా బ్యాంక్(Canara Bank) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. వడ్డీ రేట్ల(Interest Rates)ను స్వల్పంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌-బెస్డ్‌ లెండింగ్‌ రేటు(MCLR)ని 5 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో సంవత్సరం కాల పరిమితి(Year Time limit)తో ఎక్కువ మంది తీసుకునే పర్సనల్ లోన్స్(Personal Loans), వాహన రుణాల(Vehicle Loans)పై వడ్డీరేట్లు అధికం కానున్నాయి. వడ్డీరేటు సుమారు 9 శాతం నుంచి 9.05 శాతానికి పెరగనుంది. ఇక నెల, మూడు, ఆరు నెలల కాల పరిమితితో తీసుకునే లోన్స్ పై వడ్డీ రేటు 8.40 శాతం నుంచి 8.85 శాతం వరకు పెరగనున్నాయి.పెరిగిన వడ్డీ రేట్లు ఈ నెల 12 నుంచి అమలు లోకి రానున్నట్లు తెలిపింది. 


Similar News