కొత్త డీప్ ఫ్రీజర్లను విడుదల చేసిన బ్లూస్టార్!
ప్రముఖ ఏసీ, కమర్షియల్ రిఫ్రిజిరేటర్ కంపెనీ బ్లూస్టార్ తన సరికొత్త డీప్ ఫ్రీజర్లను మార్కెట్లో విడుదల చేసింది
హైదరాబాద్: ప్రముఖ ఏసీ, కమర్షియల్ రిఫ్రిజిరేటర్ కంపెనీ బ్లూస్టార్ తన సరికొత్త డీప్ ఫ్రీజర్లను మార్కెట్లో విడుదల చేసింది. మహారాష్ట్రలోని వాడీ ప్రాజెక్టులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులను తయారు చేశామని, 50 లీటర్లు మొదలుకొని 600 లీటర్ల వరకు సామర్థ్యం కలిగిన డీప్ ఫ్రీజర్లను మార్కెట్లోకి తీసుకొచ్చినట్టు కంపెనీ ఎండీ త్యాగరాజన్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చెప్పారు.
కొత్తగా తీసుకొచ్చిన కొన్ని ఉత్పత్తులను రీడిజైన్ చేసి, మరికొన్నిటిని కొత్తగా తయారు చేసినట్లు తెలిపారు. కొత్తగా విడుదల చేసిన ఉత్పత్తులను సొంత ఆర్అండ్‌డీ సెంటర్‌లోనే అభివృద్ధి చేశామని, వీటి ధరలు రూ. 15,000 నుంచి మొదలవుతాయని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 8,200 కోట్ల టర్నోవర్‌ను సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్టు త్యాగరాజన్ పేర్కొన్నారు.