బ్యాంకు ఖతాదారులకు BIG అలర్ట్.. నవంబర్‌ నెలలో భారీగా సెలవులు!

ప్రతి నెల బ్యాంకులకు సాధారణ సెలవులు ఉంటాయి.

Update: 2023-10-31 14:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి నెల బ్యాంకులకు సాధారణ సెలవులు ఉంటాయి. అంతే కాకుండా కామన్ సెలవులతో పాటు.. అదనంగా పండుగలు, జయంతులు, వర్ధంతులు అని ఇతర సెలవులతో బ్యాంకులు మూతబడతాయి. బ్యాంకుల్లో లావాదేవీలు జరిపే వారికి సెలవులు ఏ రోజు ఉన్నాయే తెలియక కాస్త ఇబ్బంది పడతారు. ముందస్తుగా బ్యాంకుల సెలవుల గురించి తెలుసుకోకపోతే సమయం వృథాతో పాటు ఆర్థిక నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. మరి సెప్టెంబర్ నెలలో మొత్తం 15 రోజులు బ్యాంకులు మూతబడనున్నాయి. అవి ఏయే రోజులో తెలుసుకుందాం..

నవంబర్ నెలలో సెలవులు

* 5వ తేదీ: ఆదివారం

* 11వ తేదీ: రెండో శనివారం

* 12వ తేదీ: ఆదివారం

* 13, 14వ తేదీల్లో నరక చతుర్థి, దీపావళి సందర్భంగా దాదాపు అన్ని నగారాల్లోని బ్యాంకులు మూత పడనున్నాయి.

* 15వ తేదీ: దీపావళి/నింగోల్ చాకౌబా/ భ్రాత్రిద్వితీయ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో సెలవు ఉంది.

* 19వ తేదీ: ఆదివారం

* 20వ తేదీ: ఛాత్ పూజ సందర్భంగా బిహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు

* 23వ తేదీ: సెంగ్ కుట్స్ నెమ్, ఈగాస్ బాగ్వాల్ పండుగ. ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో సెలవు.

* 25వ తేదీ: నాలుగో శనివారం

* 26వ తేదీ: ఆదివారం

* 27వ తేదీ: గురు నానక్ జమంతి, కార్తీక పౌర్ణమి, రహస్ పౌర్ణమి సందర్భంగా సెలవు.

* 30వ తేదీ: కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో సెలవు.


Read More..

SBI Card : రిలయన్స్, SBI సంయుక్తంగా కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు!  

Tags:    

Similar News