హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా

ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. హోమ్ లోన్ వడ్డీ రేట్లను 8.45 శాతం నుండి 8.3 శాతానికి తగ్గిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది

Update: 2024-03-19 12:48 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. హోమ్ లోన్ వడ్డీ రేట్లను 8.45 శాతం నుండి 8.3 శాతానికి తగ్గిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇది పరిమిత కాల ఆఫర్. మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ నెలాఖరు నాటికి పరిమిత కాల ఆఫర్‌గా ప్రాసెసింగ్ ఫీజులను పూర్తిగా మాఫీ చేసింది. మిగతా బ్యాంకులతో పోలిస్తే బంధన్ బ్యాంకులో 8.3 శాతం వద్ద అతి తక్కువ హోమ్ లోన్ రేటు ఉందని బ్యాంక్ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అత్యల్పంగా 8.4 శాతం రేటును కలిగి ఉన్నాయి. సౌర విద్యుత్‌ను ప్రోత్సహించడానికి రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్ల కోసం 7 శాతం వడ్డీ రేటుతో ప్రత్యేక ఫైనాన్స్ సదుపాయాన్ని బంధన్ బ్యాంక్ అందిస్తుంది. 30 సంవత్సరాల కాలానికి 8.3 శాతం వడ్డీ రేటుతో లక్షకు నెలకు రూ. 755 ప్రారంభ EMI ఉంటుంది.


Similar News