వరుసగా 72 గంటలు బ్యాంకులు బంద్.. ఈనెలలోనే!
సామాన్యులు, డబ్బు ఉన్న వారు అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరికి బ్యాంకులతో పని ఉంటుంది.
దిశ, వెబ్‌డెస్క్: సామాన్యులు, డబ్బు ఉన్న వారు అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరికి బ్యాంకులతో పని ఉంటుంది. కొంత మంది బ్యాంకు పనులు వెంటనే పూర్తి చేసుకుంటారు. మరి కొందరు మాత్రం తర్వాత చేసుకుందాం అని వదిలేస్తుంటారు. అలాంటి వారికి ఓ షాకింగ్ న్యూస్. ఈ నెలలో మూడు రోజులు పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక.. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంక్ హాటిడే క్యాలెండర్ ప్రకారం చూస్తే.. బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవు ఉంది. జూన్ 28 బక్రీద్ సెలవు. అలాగే 29 కూడా బక్రీద్ కారణంగా ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు కూడా బ్యాంకుకు సెలవు ఉంది. అదే విధంగా 30 న కూడా బ్యాంకుకు హాలిడే ఉంది. కాబట్టి బ్యాంకులతో మీకు ఏమైనా పనులు ఉంటే తొందరగా కంప్లీట్ చేసుకోవడం మంచిది.
ఇవి కూడా చదవండి:
నెలకు 210 రూపాయలతో జీవితాంతం రూ.5000 పెన్షన్
రూ. 21 వేలకే iPhone 13.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 48 వేల భారీ డిస్కౌంట్