గుడ్ న్యూస్.. FD వడ్డీ రేటును పెంచిన బజాజ్ ఫిన్సర్వ్
ఎన్‌బిఎఫ్‌సి మేజర్ బజాజ్ ఫిన్‌సర్వ్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్‌బిఎఫ్‌సి మేజర్ బజాజ్ ఫిన్‌సర్వ్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో సాధారణ పెట్టుబడిదారులు మెచ్యూరిటీ సమయంలో 8.35 శాతం వరకు వడ్డీ రేటును పొందగలిగితే, సీనియర్ సిటిజన్లు రూ. 15,000 నుంచి రూ. 5 కోట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం 8.60 శాతం వరకు సంపాదించవచ్చు. పెంచిన ఈ వడ్డీ రేట్లు మే 10 నుంచి అమలులోకి వస్తాయని.. తెలిపారు. అయితే ప్రస్తుతం 12-14 నెలల కాలానికి, బజాజ్ ఫిన్సర్వ్ సాధారణ పెట్టుబడిదారులకు రూ. 7.40 శాతం వరకు వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 15 నెలల కాలానికి, సాధారణ పెట్టుబడిదారులకు వడ్డీ రేటు 7.45 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.7 శాతం చెల్లిస్తుంది.