మహిళలకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
అమెరిరాలో ట్రంప్ విజయంతో భారీగా తగ్గిన బంగారం(Gold) ధరలు.. ఒక్కరోజులో మహిళలకు షాక్ ఇచ్చాయి.
దిశ, వెబ్‌డెస్క్: అమెరిరాలో ట్రంప్ విజయంతో భారీగా తగ్గిన బంగారం(Gold) ధరలు.. ఒక్కరోజులో మహిళలకు షాక్ ఇచ్చాయి. గురువారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1350 నుంచి రూ.1790 వరకు తగ్గింది. హైదరాబాద్‌లో 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1350 తగ్గగా.. ప్రస్తుతం ధర రూ. 58,910గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1650 తగ్గడంతో రూ.72000 కు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1790 తగ్గడంతో.. రూ.78,560కి దిగివచ్చింది. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం ఎవరు ఊహించని విధంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారానికి రూ, 910 పెరిగి.. తులం 79,470 కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 850 పెరగడంతో.. తులం 72,850కి చేరుకుంది. మరోపక్క 1000 రూపాయలు పెరిగి వెండి ధర.. హైదరాబాద్ మార్కెట్లో కేజీకీ రూ. 1,03,000 లకు చేరుకుంది. నిన్న భారీగా ధరలు తగ్గడంతో గోల్డ్ కొనేందుకు మహిళలు షాపుల వద్దకు ఈ రోజు కూడా భారీగా చేరుకున్నారు. కానీ ఒక్కసారిగా గోల్డ్ రేట్లు పెరగడంతో వారు షాక్ కు గురయ్యారు.