ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారీగా తగ్గిన వాహన ఎగుమతులు!

Update: 2023-07-16 16:20 GMT

న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక సవాళ్లు నెలకొన్న కారణంగా ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య దేశీయ వాహనాల ఎగుమతులు భారీగా క్షీణించాయి. సమీక్షించిన త్రైమాసికంలో 28 శాతం పడిపోయి మొత్తం 10,32,449 యూనిట్ల వాహనాల ఎగుమతులు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో 14,25,967 యూనిట్ల వాహనాల ఎగుమతులు జరిగాయి. ఆఫ్రికా సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో కరెన్సీ విలువలు తగ్గుముఖం పట్టడమే దీనికి కారణమని దేశ వాహన తయారీ కంపెనీల సంఘం సియామ్ వెల్లడించింది.

మొత్తం ఎగుమతుల్లో 1,52,156 ప్యాసింజర్ వాహనాలతో 5 శాతం పడిపోగా, కార్ల ఎగుమతులు 9 శాతం క్షీణించాయి. యుటిలిటీ వాహనాలు స్వల్పంగా క్షీణించి 55,419 యూనిట్లు ఎగుమతయ్యాయి. ద్విచక్ర వాహనాల ఎగుమతులు కూడా 31 శాతం పడిపోయి 7,91,316 యూనిట్లకు, కమర్షియల్ వాహనాలు 25 శాతం తగ్గి 14,625కి, త్రీ-వీలర్ వాహనాల ఎగుమతులు 25 శాతం క్షీణించి 73,360 యూనిట్లుగా నమోదయ్యాయని సియామ్ పేర్కొంది.


Similar News