Hyundai Motors: ఇన్వెస్టర్లకు భారీ షాకిచ్చిన హ్యుందాయ్.. మొదటి రోజే షేర్ ప్రైస్ ఏడు శాతం డౌన్..!
దక్షిణ కొరియాకు(South Korea) చెందిన ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్(Hyundai Motors) అనుబంధ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా(Hyundai Motor India) షేర్లు దేశీయ స్టాక్ మార్కెట్(Stack Market)లో మంగళవారం నమోదైన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ కొరియాకు(South Korea) చెందిన ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్(Hyundai Motors) అనుబంధ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా(Hyundai Motor India) షేర్లు దేశీయ స్టాక్ మార్కెట్(Stack Market)లో మంగళవారం నమోదైన విషయం తెలిసిందే. లిస్టింగ్ అయినా తొలి రోజే ఆ సంస్థ షేర్లు మదుపర్లుకు భారీ షాకిచ్చాయి. ఈ సంస్థ షేర్ ధర ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO)లో రూ.1960గా నిర్ణయించగా బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(BSE) సూచీలో 1.47శాతం డిస్కౌంట్‌తో రూ.1931 వద్ద లిస్ట్ అయ్యింది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి హ్యుండాయ్ మోటార్ షేరు ధర 7.1 శాతం నష్టంతో రూ.1807.40 వద్ద ముగిసింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE) సూచీ నిఫ్టీలో రూ.1934 వద్ద ట్రేడయింది. తరువాత దీని ధర రూ.1820.40కి పడిపోయింది. కాగా హ్యుండాయ్ మోటార్ ఇండియా ఐపీఓ ద్వారా రూ. 27,870 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అతి పెద్ద ఐపీఓ. ఇంతకముందు ఈ రికార్డు రూ. 21,000 కోట్లతో ఎల్ఐసీ(LIC) పేరిట ఉండేది.