Atul Greentech :ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ తో అతుల్ గ్రీన్‌టెక్ ఒప్పందం

ప్రముఖ ఎలక్ట్రానిక్ వాహన తయారీ కంపెనీ అతుల్ ఆటో(Atul Auto) అనుబంధ సంస్థ అతుల్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్(Atul Greentech Private Ltd) బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-10-23 14:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్ వాహన తయారీ కంపెనీ అతుల్ ఆటో(Atul Auto) అనుబంధ సంస్థ అతుల్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్(Atul Greentech Private Ltd) బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. లిథియం-అయాన్ బ్యాటరీ(Lithium-ion Battery) సరఫరా కోసం ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ (EESL)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని అతుల్ ఆటో డైరెక్టర్ విజయ్ కెడియా(Vijay Kedia) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఒప్పందం ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడంలోని ఎంతో ఉపయోగపడుతుందని ఆ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మందర్ వి డియో(Mandar V Deo) అన్నారు. కాగా EESL అనేది కోల్‌కతాకు చెందిన లెడ్-యాసిడ్ బ్యాటరీ(Lead-acid Battery) తయారీ సంస్థ. లిథియం-అయాన్ కణాలు, మాడ్యూల్స్, ప్యాక్‌ల తయారీ కోసం 2022లో ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా అతుల్ ఆటోకు సంబధించిన నాన్- ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీలను సరఫరా చేస్తోంది.

Tags:    

Similar News