ఈ ఏడాది 8-10 శాతం పెరగనున్న టెలికాం కంపెనీల సగటు ఆదాయం!

భారత టెలికాం కంపెనీల సగటు ఆదాయం(ఆర్పు) ఈ ఆర్థిక సంవత్సరంలో 8-10 శాతం పెరిగి రూ. 190కి చేరుకుంటుందని క్రిసిల్ రేటింగ్ సోమవారం ప్రకాటనలో తెలిపింది.

Update: 2023-08-28 16:21 GMT

న్యూఢిల్లీ: భారత టెలికాం కంపెనీల సగటు ఆదాయం(ఆర్పు) ఈ ఆర్థిక సంవత్సరంలో 8-10 శాతం పెరిగి రూ. 190కి చేరుకుంటుందని క్రిసిల్ రేటింగ్ సోమవారం ప్రకాటనలో తెలిపింది. అలాగే, ఈ ఏడాదికి సంబంధించి టెలికాం కంపెనీల నిర్వహణ లాభాలు 15-17 శాతం పెరిగి, సుమారు రూ. 1.2 లక్షల కోట్లకు చేరుకోవచ్చని క్రిసిల్ వెల్లడించింది. అధిక డేటా ప్లాన్‌లకు గణనీయమైన డిమాండ్ కారణంగా కంపెనీల లాభాలు పుంజుకుంటాయి.

ఇది దేశీయంగా డేటా వినియోగం పెరుగుదలను సూచిస్తుందని క్రిసిల్ అభిప్రాయపడింది. గతేడాది నెలకు ఒక వినియోగదారు 20జీబీ డేటా వినియోగించగా, ఈ ఏడాది 23-25జీబీకి పెరగనుంది. ప్రస్తుతానికి 5జీ సేవల నుంచి ఆదాయం పరిమితంగా ఉండనున్నప్పటికీ కంపెనీల లాభాలు మెరుగ్గా ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మనీష్ గుప్తా చెప్పారు.


Similar News