అమెజాన్ ప్రైమ్ డే సేల్.. స్కామర్‌ల చేతిలో బలి అవ్వొద్దు: నిపుణుల హెచ్చరిక

ఈ ప్రత్యేక సేల్ సందర్భంగా కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు

Update: 2024-07-16 12:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ ఈ నెలాఖరులో 'అమెజాన్ ప్రైమ్ డే సేల్ ' పేరుతో ప్రత్యేక సేల్‌ను నిర్వహించనుంది. ఇప్పటికే పలు ఉత్పత్తులపై డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లను ప్రకటించింది. అయితే, ఈ ప్రత్యేక సేల్ సందర్భంగా కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గతంలో కంటే ఈసారి స్కామర్‌లు ఎక్కువ మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారని, అమెజాన్ రిటైలర్‌ల పేరుతో నకిలీ మెసేజ్‌లు, ఈ-మెయిల్‌ల నుంచి స్కామ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రత్యేక సేల్ సమయంలో వినియోగదారులు ఎక్కువ ఖర్చు చేస్తారనే ఉద్దేశంతో వివిధ రకాలుగా మోసాలు జరిగే వీలుందని, కస్టమర్లు బలి అవ్వొద్దని సూచించారు. ఈ నెల 20,21 తేదీల్లో ప్రైమ్ డే సేల్ మొదలవనుంది. దీంతో స్కామర్‌లు అమెజాన్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్ల ద్వారా మోసగించవచ్చు. కాబట్టి సోషల్ మీడియాలో లేదా మెసేజ్, ఈ-మెయిల్ ద్వారా వచ్చే తప్పుడు లింక్‌లను క్లిక్ చేయవద్దని సైబర్ సెక్యూరిటీ కంపెనీ చెక్ పాయింట్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ తెలిపింది. ఇప్పటికే దాదాపు 1,230 కొత్త వెబ్‌సైట్లు అమెజాన్‌తో అనుబంధంగా పనిచేస్తున్నాయి. వాటిలో చాలావరకు మోసగించేవి ఉన్నాయని కంపెనీ పేర్కొంది. 

Tags:    

Similar News