మరోసారి భారీ ఆఫర్లతో అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ప్రారంభ తేదీ ఇదే!
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తన పండుగ సీజన్ అతిపెద్ద సేల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్-2023 తేదీలను ప్రకటించింది
బెంగళూరు: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తన పండుగ సీజన్ అతిపెద్ద సేల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్-2023 తేదీలను ప్రకటించింది. అక్టోబర్ 8 నుంచి ఈ సేల్ ప్రారంభమవుతుందని తెలిపింది. అయితే, ముగింపు తేదీని కంపెనీ వెల్లడించలేదు. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రైబర్లు ఒకరోజు ముందుగానే సేల్ యాక్సెస్‌తో పాటు ఒక్కరోజులోనే డెలివరీ ప్రయోజనాలను పొందనున్నారు.
మరో ఈ-కామర్స్ దిగ్గజ ఫ్లిప్‌కార్ట్ సైతం అదే రోజున తన బిగ్ బిలియన్ డేస్‌ను ప్రారంభించనుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 15 వరకు ఉండనుంది. ఇక, అమెజాన్ పండుగ సీజన్ సేల్కు సంబంధించిన రాయితీ, ఆఫర్లను కూడా ప్రకటించింది. ఎస్బీఐ ఖాతాదారులు తమ కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపును పొందనున్నారు.
అలాగే, ఈ సేల్‌లో మొబైల్, గృహోపకరణాలపై 40 శాతం వరకు డిస్కౌంట్, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్, ఇతర ఉత్పత్తులపై 75 శాతం వరకు తగ్గింపును పొందనున్నారు. స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్, రియల్మీ, ఐకూపై భారీ డిస్కౌంట్లు ఉంటాయని, ఎంత మేరకు ఇవ్వనునది త్వరలో ప్రకటిస్తామని అమెజాన్ పేర్కొంది.