Air India: అర్హత లేని పైలట్లతో విమాన ప్రయాణం.. ఎయిర్‌ఇండియా కు భారీ జరిమానా
నాన్ క్వాలీఫైడ్ పైలట్లతో విమానాన్ని నడిపించినందుకు ఎయిర్ ఇండియా సంస్థకు డీజీసీఏ భారీ జరిమానా విధించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: నాన్ క్వాలీఫైడ్ పైలట్లతో విమానాన్ని నడిపించినందుకు ఎయిర్ ఇండియా సంస్థకు డీజీసీఏ భారీ జరిమానా విధించింది. రూ.98 లక్షలు జరిమానా విధిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా అర్హత లేని పైలట్లతో ఎయిర్ లైన్స్ ను నడిపిస్తున్నట్లు ఏవియేషన్ రెగ్యూలేటరీ గుర్తించింది. దీంతో ఆ సంస్థకు రూ.98 లక్షల జరిమానా విధించడంతో పాటు విమానం నడిపించిన సంస్థ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ కు రూ.6 లక్షలు, క్యారియర్ డైరెక్టర్ ఆఫ్ ట్రైనింగ్ కు రూ.3 లక్షలు జరిమానా విధిస్తున్నట్లు ఏవియేషన్ వాచ్ డాగ్ ప్రకటించింది.
జూలై 10న ఎయిర్ లైన్స్ సంస్థ స్వచ్చంద నివేదికలో రెగ్యూలర్ డాక్యూమెంటేషన్, షెడ్యూలింగ్ సౌకర్యంతో పాటు స్పాట్ చెక్ సహా క్యారియర్ కార్యకలాపాలను సివిల్ ఏవియేషన్ పరిశీలించింది. ఇందులో అనేక పోస్ట్ హోల్డర్లు, సిబ్బంది నియమ నిబందనలలోని లోపాలు, అర్హత లేని పైలట్లతో ప్రయాణం సహా పలు ఉల్లంఘనలు ఉన్నట్లు గుర్తించింది. ఇది ప్రయాణికుల భద్రతను గణనీయంగా ప్రభావితం చేస్తాయని చెబుతూ జూలై 22న ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసులు విడుదల చేసింది. దీనిపై సంస్థ సమర్పించిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో చర్యలు చేపడుతూ జరిమానా విధించింది. అంతేగాక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరకుండా జాగ్రత్తలు వహించాలని సంబందిత పైలట్ ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) హెచ్చరించింది.