Air Travel: విమాన ప్రయాణం మరింత ప్రియం.. జెట్ ఫ్యూయల్ ధరను పెంచిన చమురు సంస్థలు..!
విమానాలలో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధన(ATF) ధరలను మరోసారి పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: విమానాలలో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధన(ATF) ధరలను మరోసారి పెంచుతూ చమురు సంస్థలు(Oil companies) నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్(Global Market)లో ముడి చమురు పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. కాగా ఆయిల్ రిఫైనరీ కంపెనీలు గత నెలలోనే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ను కిలోలీటర్(Kilo Leter)కు రూ. 2941 పెంచగా.. తాజాగా దాన్ని మరో రూ. 1318 పెంచాయి. దీంతో ఢిల్లీ(Delhi)లో ప్రస్తుతం జెట్ ఫ్యూయల్ కిలోలీటర్ ధర రూ. 91,856కు చేరుకుంది. ఇక కోల్‌కతా(Kolkata)లో రూ. 94,551గా, ముంబై(Mumbai)లో రూ. 85,861గా, చెన్నై(Chennai)లో రూ. 95,231గా ఉన్నాయి. పెరిగిన ధరలు ఈ రోజు(డిసెంబర్ 1) నుంచే అమల్లోకి రానున్నాయి. కాగా జెట్ ఫ్యూయల్ ధరలు పెరగడంతో ఫ్లైట్ టికెట్లు(Flight Tickets) ధర కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో విమాన ప్రయాణం(Air Travel) మరింత ప్రియం కానుంది.