Air India-Vistara: ఎయిర్ ఇండియా-విస్తారా విలీనం.. రూ. 3,195 కోట్ల పెట్టుబడి పెట్టనున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్
టాటా గ్రూప్(Tata Group)కు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా(Air India)లో, సింగపూర్ ఎయిర్‌లైన్స్(SIA) గ్రూప్ విస్తారా(Vistara)ను విలీనం చేయనున్న సంగతి తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: టాటా గ్రూప్(Tata Group)కు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా(Air India)లో, సింగపూర్ ఎయిర్‌లైన్స్(SIA) గ్రూప్ విస్తారా(Vistara)ను విలీనం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సంస్థల విలీన ప్రక్రియ 2022 నవంబర్ 29న స్టార్ట్ కాగా ఈ రోజు పూర్తి కానుంది. కాగా విలీనం తర్వాత సింగపూర్ ఎయిర్‌లైన్స్ కు ఎయిర్ ఇండియాలో 25.1 శాతం వాటా ఉండనుంది. ఈ నేపథ్యంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాలో రూ. 3,195 కోట్లు పెట్టుబడులు(Investments) పెడుతున్నట్టు ప్రకటించింది. కాగా విస్తారా 2015 జనవరి 9 నుంచి మన ఇండియాలో సేవలందిస్తోంది. అయితే విలీనం తర్వాత ఈ నెల 12 నుంచి ఎయిర్ ఇండియా-విస్తారా కలిసి ఒకటే విమానయాన సంస్థగా సేవలు అందించనుంది. ఎయిర్ ఇండియా అవసరాల దృష్ట్యా భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెడుతామని సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.