అదానీ కంపెనీతో కలిసి ట్రావెల్ కో-బ్రాండెడ్ కార్డు తీసుకురానున్న 'వీసా'!
దేశీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన సంస్థతో కో-బ్రాండెడ్ కార్డులు తెచ్చేందుకు సంబంధించిన ఒప్పందం చేసుకున్నట్టు అమెరికాకు చెందిన డిజిటల్ చెల్లింపుల దిగ్గజం వీసా తెలిపింది.
ముంబై: దేశీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన సంస్థతో కో-బ్రాండెడ్ కార్డులు తెచ్చేందుకు సంబంధించిన ఒప్పందం చేసుకున్నట్టు అమెరికాకు చెందిన డిజిటల్ చెల్లింపుల దిగ్గజం వీసా తెలిపింది. ఈ కో-బ్రాండెడ్ కార్డులను రిటైల్, విమానాశ్రయాలు, ఆన్‌లైన్ ప్రయాణాలకు వినియోగించవచ్చని, తద్వారా 40 కోట్ల మంది ప్రయాణీకులు, వినియోగదారులు ప్రయోజనాలు పొందనున్నారని వెల్లడించింది. అంతేకాకుండా అదానీ కంపెనీతో భాగస్వామ్యం అదానీ ఎయిర్‌పోర్టులు, ఆన్‌లైన్ ట్రావెల్ సర్వీసెస్ ద్వారా 40 కోట్ల మందికి తాము చేరువయ్యే అవకాశం లభిస్తుందని వీసా సీఈఓ ర్యాన్ మెక్‌నెర్ని అభిప్రాయపడ్డారు.
ఇరు సంస్థల భాగస్వామ్యంలో వచ్చే కో-బ్రాండెడ్ కార్డులను ఉపయోగించి కొనుగోళ్లు, ఇతర సేవలల్లో కంపెనీల నుంచి ప్రయోజనాలు పొందనున్నారు. రివార్డులు, డిస్కౌంట్లు సహా అనేక ప్రయోజనాలు పొందవచ్చని కంపెనీ వివరించింది. కాగా, ప్రస్తుతం దేశీయంగా ఐసీఐసీఐ-మేక్ మై ట్రిప్ కార్డ్, ఎస్‌బీఐ-యాత్రా, యాక్సిస్ బ్యాంక్-విస్తారా క్రెడిట్ కార్డుతో మరికొన్ని ట్రావెల్ కో-బ్రాండెడ్ కార్డులు అందుబాటులో ఉన్నాయి.
Read More: విమర్శల వల్ల ఫ్యామిలీపై ప్రభావం.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా అంటూ Varun కామెంట్స్