విదేశీ రుణాల కోసం ప్రయత్నిస్తున్న అదానీ కంపెనీ!
డేటా సెంటర్ సంస్థ ఎడ్జ్‌కనెక్స్, అదానీ గ్రూప్‌ల జాయింట్ వెంచర్ అదానీ కనెక్స్ కంపెనీ విదేశీ... Adani Group joint venture in talks for 1st offshore loan since Hindenburg
ముంబై: డేటా సెంటర్ సంస్థ ఎడ్జ్‌కనెక్స్, అదానీ గ్రూప్‌ల జాయింట్ వెంచర్ అదానీ కనెక్స్ కంపెనీ విదేశీ రుణాల కోసం అర డజను వరకు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సుమారు 220 మిలియన్ డాలర్ల(రూ. 1,808 కోట్ల) కోసం ప్రయత్నాలు చేస్తోందని సంబంధిత వ్యక్తులు వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ నివేదిక వచ్చిన తర్వాత అదానీ గ్రూపునకు చెందిన కంపెనీ విదేశీ రుణాల కోసం ప్రయత్నించడం ఇదే మొదటిసారి. ఐదేళ్ల కాలపరింతితో ఈ అప్పును తీసుకోవాలని, రానున్న కొద్దిరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని కంపెనీ భావిస్తోంది. చర్చలు విజయవంతంగా పూర్తయి అప్పు లభిస్తే డేటా సెంటర్ల మౌలిక సదుపాయాల కోసం వినియోగించనున్నట్టు సమాచారం. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణల కారణంగా సంస్థ విలువ సగానికి పైగా కుదేలైంది. దీనికి సంబంధిచిన వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే అదానీ కనెక్స్ విదేశీ రుణాల కోసం వెళ్లడం ఆసక్తికరంగా మారింది.