ఏటా 50 శాతం వృద్ధి చెందనున్న ఏసీసీ బ్యాటరీ మార్కెట్: సీఐఐ!

దేశీయంగా అడాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ మార్కెట్ గిరాకీ భారీగా వృద్ధి చెందుతోందని ఆదివారం విడుదలైన సీఐఐ నివేదిక వెల్లడించింది.

Update: 2023-08-13 12:48 GMT

న్యూఢిల్లీ: దేశీయంగా అడాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ మార్కెట్ గిరాకీ భారీగా వృద్ధి చెందుతోందని ఆదివారం విడుదలైన సీఐఐ నివేదిక వెల్లడించింది. 2022లో 20గిగావాట్ అవర్ ఉన్న ఉన్న అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్(ఏసీసీ) బ్యాటరీ డిమాండ్ 2030 నాటికి ఏటా 50 శాతం వృద్ధితో 220 గిగావాట్ అవర్‌కు పెరుగుతుందని అంచనా. స్థానికంగా బ్యాటరీ తయారీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుండటం, పటిష్టమైన స్థానిక సరఫరా వ్యవస్థ ద్వారా వృద్ధికి మద్దతు లభిస్తుందని సీఐఐ తెలిపింది.

ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీ కీలకమైన ముడిసరుకు. మెరుగైన పనితీరు కలిగిన ఈవీల అభివృద్ధికి బ్యాటరీ టెక్నాలజీ మరింత పురోగతి సాధించిన కీలకమని ఫ్యూచర్ మొబిలిటీపై సీఐఐ జాతీయ కమిటీ ఛైర్మన్ విపిన్ సోంధీ అన్నారు. భారత్ స్థానిక బ్యాటరీ ముడి పదాథాలు, తయారీ సెట్-అప్‌ను బలోపేతం చేయడమే కాకుండా ఈ విభాగంలో చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు అధిక-నాణ్యత, వినూత్న బ్యాటరీ పదార్థాల సరఫరాదారుగా ప్రపంచానికి తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు.


Similar News