బ్యాంకులకు చేరిన 93 శాతం రూ. 2,000 నోట్లు!

మార్కెట్లో చలామణీలో ఉన్న రూ. 2,000 నోట్లలో 93 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) శుక్రవారం ప్రకటనలో తెలిపింది.

Update: 2023-09-01 13:12 GMT

ముంబై: మార్కెట్లో చలామణీలో ఉన్న రూ. 2,000 నోట్లలో 93 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) శుక్రవారం ప్రకటనలో తెలిపింది. వీటి విలువ రూ. 3.32 లక్షల కోట్లని పేర్కొంది. బ్యాంకులకు తిరిగి వచ్చిన మొత్తం అన్ని నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో రాగా, మిగిలినవి ప్రజలు బ్యాంకుల నుంచి ఇతర నోట్లతో మార్చుకున్నారని ఆర్‌బీఐ వెల్లడించింది.

ఈ ఏడాది మే 19న ఆర్‌బీఐ పెద్ద నోట్ల చలామణిని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ. 2,000 నోట్లు వ్యవస్థలో వినియోగంలో ఎక్కువగా లేవని, అందుకే వీటి ఉపసంహరణ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని మే మూడో నాలుగో వారం ప్రకటనలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. పెద్ద నోట్లను డిపాజిట్ చేయడం లేదంటే మార్చుకోవడానికి ప్రజలకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంటుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా, గడువు ముగియకమునుపే ప్రజలు రూ. 2,000 నోట్లను మార్చుకోవాలని సూచించింది.

Tags:    

Similar News