ఐటీలో తగ్గుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగంలో కాంట్రాక్ట్ నియామకం దాదాపు 20% పడిపోయింది. .Latest Telugu News
హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగంలో కాంట్రాక్ట్ నియామకం దాదాపు 20% పడిపోయింది. పెరుగుతున్న మార్జిన్ ఒత్తిడి కారణంగా, కంపెనీలు తమ శాశ్వత ఉద్యోగులను కొనసాగించడంపై దృష్టి సారించాయి. ఈ ఏడాది మార్చి నుంచి ఐటీ సంస్థలలో కాంట్రాక్ట్ సిబ్బందికి డిమాండ్ 10-20% క్షీణించినట్లు మానవ వనరుల ప్రొవైడర్, తాత్కాలిక సిబ్బంది సంస్థ అయిన Adecco తెలిపింది. సాంకేతిక రంగంలో ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ పని అనుభవం ఉన్న IT, IT-ఎనేబుల్డ్ సర్వీసెస్ (ITeS) స్పేస్‌లో కాంట్రాక్ట్ కార్మికులు 10-12% ఉన్నారని, కరోనా సంక్షోభం నేపథ్యంలో కాంట్రాక్ట్ సిబ్బంది తగ్గుదల నమోదైందని Adecco అంచనా వేసింది.
"టెక్ కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్ కార్యకలాపాలను అమలు చేయడానికి శాశ్వత ఉద్యోగులను నియమించుకోవడానికి చూస్తున్నాయి. మా ఆదాయంలో దాదాపు 40% IT కాంట్రాక్ట్ సిబ్బంది పై ఆధారపడి ఉంది. గత మూడు నెలలతో పోలిస్తే ఈ త్రైమాసికంలో (జులై-సెప్టెంబర్) డిమాండ్ 30% తగ్గింది" అని టెక్ రిక్రూట్‌మెంట్ సంస్థ HanDigital వ్యవస్థాపకుడు శరణ్ బాల సుందరం అన్నారు. ఇదే ధోరణి కొనసాగితే, ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఐటీ లో కాంట్రాక్టు సిబ్బందిపై ఎక్కువగా ఆధారపడిన రిక్రూట్‌మెంట్ సంస్థల ఆదాయం 12-15% దెబ్బతింటుందని బాల సుందరం తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Post Office super hit Scheme: కేవలం రూ.5 వేల పెట్టుబడితో సొంతంగా వ్యాపారం..