Ashish Khanna: అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కొత్త సీఈవోగా ఆశిష్ ఖన్నా నియామకం..!

అదానీ గ్రూప్(Adani Group)కు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(AGEL) సోమవారం కీలక ప్రకటన చేసింది.

Update: 2024-12-30 15:52 GMT

దిశ, వెబ్ డెస్క్: అదానీ గ్రూప్(Adani Group)కు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(AGEL) సోమవారం కీలక ప్రకటన చేసింది. అదానీ గ్రీన్ ఎనర్జీ కొత్త సీఈవోగా ఆశిష్ ఖన్నాను(Ashish Khanna) నియమిస్తున్నామని తెలిపింది. ప్రస్తుత సీఈవో అమిత్ సింగ్(Amit Singh) స్థానంలో ఏప్రిల్ 1న పదవీ బాధ్యతలు చేపడుతాడని, ప్రణాళికాబద్ధమైన మార్పులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ఈ మేరకు కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో(Exchange Filing) పేర్కొంది. కాగా ఖన్నా ప్రస్తుతం అదానీ గ్రూప్ ఇంటర్నేషనల్ ఎనర్జీ బిజినెస్ సీఈఓగా పనిచేస్తున్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీ ఇటీవలే రాజస్థాన్(Rajasthan) లోని జోథ్ పూర్(Jodhpur) జిల్లా బడిసిద్(Badsid)లో 250 మెగావాట్ల సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును ప్రారంభించింది. దీంతో తమ సంస్థకు సంబంధించి మొత్తం సోలార్ ప్రొడక్షన్ కెపాసిటీ 11, 434 మెగావాట్లకు పెరిగిందని ఓ ప్రకటనలో తెలిపింది.

Tags:    

Similar News