‘మెరుగైన రుణాల పంపిణీతో రికవరీ సంకేతాలు’

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ తన వ్యక్తిగత రుణాల పంపిణీ గతేడాదిలో 95 శాతం రికవరీ సాధించినట్టు వెల్లడించింది. కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి ఉన్నప్పటికీ సెప్టెంబర్ నెలలో మెరుగైన వ్యక్తిగత రుణాల పంపిణీని నిర్వహించామని, సంక్షోభానికి ముందున్న స్థాయికి వ్యాపారం కోలుకుంటోందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పేర్కొంది. వ్యక్తిగత రుణాల విభాగం ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్య నెలవారీ మెరుగుదలను చూస్తూన్నామని హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అలాగే, ఈ […]

Update: 2020-10-06 03:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ తన వ్యక్తిగత రుణాల పంపిణీ గతేడాదిలో 95 శాతం రికవరీ సాధించినట్టు వెల్లడించింది. కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి ఉన్నప్పటికీ సెప్టెంబర్ నెలలో మెరుగైన వ్యక్తిగత రుణాల పంపిణీని నిర్వహించామని, సంక్షోభానికి ముందున్న స్థాయికి వ్యాపారం కోలుకుంటోందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పేర్కొంది. వ్యక్తిగత రుణాల విభాగం ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్య నెలవారీ మెరుగుదలను చూస్తూన్నామని హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

అలాగే, ఈ త్రైమాసికంలో రుణ దరఖాస్తుల సంఖ్య గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 12 శాతం పెరిగాయని, అదేవిధంగా రుణాల ఆమోదం గతేడాదితో పోలిస్తే 9 శాతం పెరిగాయని బ్యాంకు పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన సెప్టెంబర్‌లో వాల్యూమ్ పరంగా వ్యక్తిగత రుణ రసీదులు 21 శాతం పెరిగాయని, ఆమోదాలు 31 శాతం అధికంగా ఉన్నట్టు బ్యాంకు తెలిపింది. ఈ పెరుగుదలలు కొవిడ్-19కి ముందునాటి స్థాయిలను సూచిస్తున్నాయని పేర్కొంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు మొత్తం రూ. 3,026 కోట్ల రుణాలను కేటాయించింది. గతేడాది ఇదే కాలంలో కేటాయించిన రుణాల మొత్తం రూ. 7,160 కోట్లు. అలాగే, ఈ త్రైమాసికంలో డివిడెండ్ ద్వారా కంపెనీ స్థూల ఆదాయం రూ. 232 కోట్లని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.

Tags:    

Similar News