ఎములాడ.. భక్తులేడ?

దిశ, కరీంనగర్: ఉత్తర తెలంగాణలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన కరీంనగర్ టవర్ సర్కిల్, ప్రకాషం గంజ్‌పై కూడా కరోనా ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. నిత్యం వివిధ రకాల వ్యాపారాలతో కోట్ల రూపాయలు టర్నోవర్‌కు కేంద్రంగా ఉండే ఈ ప్రాంతంలో ప్రస్తుతం వ్యాపారం సగానికి పడిపోయింది. తెలంగాణలో అతి పెద్ద శైవ క్షేత్రమైన వేములవాడలో భక్తుల సంఖ్య కొంతమేర తగ్గిందని దేవాదాయ అధికారులు అంచనా వేశారు. అయితే ఆలయానికి వచ్చే భక్తులకు వ్యాధి ప్రబలే ప్రమాదం ఉందని భావించిన […]

Update: 2020-03-17 06:36 GMT

దిశ, కరీంనగర్: ఉత్తర తెలంగాణలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన కరీంనగర్ టవర్ సర్కిల్, ప్రకాషం గంజ్‌పై కూడా కరోనా ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. నిత్యం వివిధ రకాల వ్యాపారాలతో కోట్ల రూపాయలు టర్నోవర్‌కు కేంద్రంగా ఉండే ఈ ప్రాంతంలో ప్రస్తుతం వ్యాపారం సగానికి పడిపోయింది. తెలంగాణలో అతి పెద్ద శైవ క్షేత్రమైన వేములవాడలో భక్తుల సంఖ్య కొంతమేర తగ్గిందని దేవాదాయ అధికారులు అంచనా వేశారు. అయితే ఆలయానికి వచ్చే భక్తులకు వ్యాధి ప్రబలే ప్రమాదం ఉందని భావించిన ఆలయ అధికారులు ధర్మగుండాన్ని మూసివేశారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు ధర్మగుండంలో స్నానం చేస్తే వ్యాధి త్వరితగతిన ప్రబలే ప్రమాదం ఉందని భావించిన అధికారులు ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు.

గ్రానైట్ గడ్డకు.. కరోనా అడ్డు

కరోనా వైరస్ ప్రభావం కరీంనగర్ జిల్లా ఆర్థిక మూలాలను దెబ్బతీసింది. వైరస్ ప్రభావంతో ఇక్కడి నుంచి చైనాకు ఎగుమతి కావాల్సిన గ్రానైట్ ఎక్కడిక్కడే నిలిచిపోయింది. కరీంనగర్ నుంచి చైనాకు ప్రతి నెల 30 వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ ఎగుమతి అయ్యేది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా చైనాకు చెందిన వ్యాపారులెవరూ కరీంనగర్‌కు రాలేకపోవడంతో గ్రానైట్ వ్యాపారం స్తంభించిపోయింది. కోట్ల రూపాయల విలువ చేసే గ్రానైట్ కరీంనగర్‌లోని క్వారీల్లో నిలిచిపోయింది. వ్యాపారులపైన ఈ ప్రభావం పడటంతో పాటు దీనిపై ఆధారపడి జీవించే 20 వేల మంది ఉద్యోగులు, కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది.

tags : Carona, Karimnagar, Granite, Vemulawada, Tower circle

Tags:    

Similar News