ఆధునిక డిజైన్లతో బస్ టెర్మినల్ నిర్మాణం
దిశ, న్యూస్‌బ్యూరో: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని బస్ టెర్మినల్ నిర్మించనున్నట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. బస్ టెర్మినల్ నిర్మాణంపై సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మెట్రోస్టేషన్, రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రయాణీకులకు, ఆర్టీసీ, ప్రవేట్ వాహనాల రాకపోకలకు సౌకర్యంగా ఉండేవిధంగా బస్ టెర్మినల్ డిజైన్ ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా ఏజెన్సీలు రూపొందించిన డిజైన్లను పరిశీలించారు. రైల్వే స్టేషన్ ముందు భాగాన, […]
దిశ, న్యూస్‌బ్యూరో: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని బస్ టెర్మినల్ నిర్మించనున్నట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. బస్ టెర్మినల్ నిర్మాణంపై సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మెట్రోస్టేషన్, రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రయాణీకులకు, ఆర్టీసీ, ప్రవేట్ వాహనాల రాకపోకలకు సౌకర్యంగా ఉండేవిధంగా బస్ టెర్మినల్ డిజైన్ ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా ఏజెన్సీలు రూపొందించిన డిజైన్లను పరిశీలించారు. రైల్వే స్టేషన్ ముందు భాగాన, ప్రస్తుత సిటీ బస్సులు ఆగేందుకు ఏర్పాటు చేసిన బస్‌బేలను ఆధునిక డిజైన్లతో మౌలిక వసతులతో నిర్మించనున్నట్లు తెలిపారు. మహిళలు, పురుషులకు విడివిడిగా వేర్వేరు ప్రాంతాల్లో టాయిలెట్లు ఉండాలని స్పష్టం చేశారు. గ్రీనరీ, ఆర్టీసీ కంట్రోల్ రూం, పోలీస్ సెక్యూరిటీ పాయింట్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో ట్రాఫిక్‌ను ఫ్రీ చేసేందుకు ఈ టెర్మినల్ ఉపయోగపడుతుందని మేయర్ తెలిపారు. ఈ సమావేశంలో కెఎన్ఆర్ ఏజెన్సీ, కన్సల్టెంట్స్ యూనియాడ్స్, ప్రకాష్ యాడ్స్, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌ఈ అనిల్‌రాజ్ పాల్గొన్నారు.