మహిళా ప్రయాణికుల భద్రత కోసం ‘బస్సులో భరోసా’
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రజారవాణా వినియోగం పెరుగుతున్న వేళ మహిళా ప్రయాణికులపై ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. దీంతో రాత్రి సమయాల్లో ఒంటరిగా ప్రయాణం చేసేందుకే మహిళలు, యువతులు భయపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఆవాజ్-ఈ- తెలంగాణ’లో భాగంగా మహిళలపై జరుగుతున్న ఆగడాలను అరికట్టేందుకు ముగ్గురు మహిళలు ముందుకొచ్చారు. బడ్డింగ్ చైల్డ్ రైట్స్ కార్యకర్త హిమబిందుతో పాటు కౌముది నాగరాజు, నిఖిత కలిసి లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ‘బస్సులో భరోసా’ అని ఆన్‌లైన్‌లో ప్రచారం […]
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రజారవాణా వినియోగం పెరుగుతున్న వేళ మహిళా ప్రయాణికులపై ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. దీంతో రాత్రి సమయాల్లో ఒంటరిగా ప్రయాణం చేసేందుకే మహిళలు, యువతులు భయపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఆవాజ్-ఈ- తెలంగాణ’లో భాగంగా మహిళలపై జరుగుతున్న ఆగడాలను అరికట్టేందుకు ముగ్గురు మహిళలు ముందుకొచ్చారు.
బడ్డింగ్ చైల్డ్ రైట్స్ కార్యకర్త హిమబిందుతో పాటు కౌముది నాగరాజు, నిఖిత కలిసి లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ‘బస్సులో భరోసా’ అని ఆన్‌లైన్‌లో ప్రచారం ప్రారంభించారు. వీరంతా వివిధ రకాలుగా సమావేశాలు ఏర్పాటు చేయడం, పోస్టర్లు అంటించడం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ప్రజారవాణాలో లైగింకంగా వేధిస్తే ఎలా ప్రతిఘటించాలి, ఎలా ఎదుర్కోవాలో మహిళలకు తెలిస్తే చాలా వరకు నేరాలు తగ్గుతాయని ‘బస్సులో భరోసా’ సభ్యులు చెబుతున్నారు.
అయితే, ఇలాంటి కార్యక్రమానికి పోలీసుల తోడ్పాటు కోసం రాచకొండ సీపీ మహేష్ భగవత్‌ని కోరగా.. ఇకపై జరిగే కార్యక్రమాలకు పోలీసులు, షీ టీమ్‌ల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే, బస్సు లోపల అవగాహన కల్పించేలా.. ల్యామినేటెడ్ పోస్టర్లను అతికించాలని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, సంస్థ ఎండీ సజ్జనార్‌లను అభ్యర్థిస్తున్నారు. వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.
@tsrtcmdoffice, @TSRTCHQ @Govardhan_MLA – Sir, we request you to pls ensure announcements & laminated posters are installed inside #TSRTC buses to raise awareness against #SexualHarassment
Pls support our ask – https://t.co/n9dV3qHqVs@TS_SheTeams @SCWTelangana @ts_womensafety https://t.co/YblH1wsd3r
— #BusLoBharosa (@buslobharosa) October 1, 2021